Wednesday, May 20, 2009

లోకులు కాకులు!

కాకిని.


ఏ కాకిని?
ఏకాంత లోకపు ఏకైక కాకిని.


ఎక్కడా లోకం?
మదిలొ ఓ గదిలొ.


ఎందుకా గది?
కాకులకు, లోకులు కాకులు. శోక మూకలు.
వాటి కేకలకు లేవు బ్రేకులు.
అందుకే,
నావి కాక ఏ కాకి కేకలకు నా మదిలోని ఈ గదిలోకి లెవు రాక పోకలు.


ఏమైంది ఆ కేకలకు?
కావు కావు మని గావు కేకలు.
ఆ కేకలు నాకోసం కావ్!
ఆ కాకులు నాకు ఎమీ కావ్! కావ్! కావ్!


నేను కాకిని కానూ? నావి కేకలు కావూ?
అవును కదా. ఇప్పుడె కావు కావు మన్నా కూడా!
అయ్యూ! confusion గా ఉంది.
ఎదైన కాకి దొరికితె బాగుండు,
కాస్త నా బాద పంచుకోవచ్చు.
అయ్యయ్యొ! నా మదిలొ ఈ గదిలొ నేను కాక ఏ కాకీ లెదే!
నెను ఏ కాకికీ ఎమీ కాకుండా పోయింది నేను కట్టుకున్న గొడల వళ్ళెన?



కాకిని.


ఏ కాకిని?
ఏ కాకి కాకిని?
ఏకాకిని.
ఏకాకి కాకిని.

No comments: