Saturday, March 14, 2009

మేఘ సం"దేశం"


ప||
హరివిల్లు ఇల్లుగ.. పన్నీటి జల్లుల.. స్వర్గమేన
జడివాన నీడలా.. కన్నీటి కళ్ళకి.. స్వప్నమేన
అ ప||
వెలుగు-నీడల వెర్రి యుద్దము..
..............................పెను తుఫనుగా మారేన
వెండి పూతల నీలి మేఘము..
..............................కాంతి క్రాంతినే ఆపేన
ప||
హరివిల్లు ఇల్లుగ.. పన్నీటి జల్లుల.. స్వర్గమేన
జడివాన నీడలా.. కన్నీటి కళ్ళకి.. స్వప్నమేన


చ||
మల్లె అంచును విడిచి వెళ్ళిన..
...........................మంచు జాడలు తెలిసేన
నింగినంటిన వడగల్ల గర్వము..
..........................పూల కాడలే తుంచేన
నీటి గూటిని కొల్లగొట్టి..
........................(కుర్ర)కారు మబ్బులు ఎదిగేన
చల్లగుండు మరు చొటికేగి ..
........................కుండపొత కురిపించేన

ప||
హరివిల్లు ఇల్లుగ.. పన్నీటి జల్లుల.. స్వర్గమేన
జడివాన నీడలా.. కన్నీటి కళ్ళకి.. స్వప్నమేన


ప||
అనుమాన నీడలు.. వెన్నంటి ఉండగా.. సాద్యపడునా?
జబిల్లి మెల్లగ.. మబ్బుల్ని వీడగా.. సత్యమగునా!
అ ప||
వెండి పూతల నీలి మేఘము..
...........................కాంతి ఉందని ఆశేన
వెలుగు-నీడల ఐకమత్యము..
...........................హర్ష వర్షమై కురిసేన


[Inspired by a tune made by Ringo.

The tune started of with a rain-theme, and suddenly Ringo came up with a music bit, which, we all thought, was patriotically oriented. Hence, this came up. This was lying incomplete for a longtime and hence the song never got completed.
The standard patterns, usually followed to write songs, weren't followed. I couldn't. There is only one charanam, and I'm not sure if the part called anu-pallavi by me can actually be called that. Please point out mistakes if you happen to find some. ]